వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటన

గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించిన సీఎం... దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకున్న బాబు

By :  Raju
Update: 2024-09-05 09:17 GMT

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబునాయుడు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముందు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతల్లో పనులపై అధికారులతో సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్‌ పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. నేను వెళ్లాను కాబట్టే అధికారులు వేగంగా స్పందించారు. నదికి వాగుకు తేడా తెలియని వ్యక్తి నా పనితీరును విమర్శిస్తాడా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇల్లు మినిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తానని అంటున్నారు. అబద్ధం చెప్పినా నమ్మేలా ఉండాలన్నారు. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమని బాబు విమర్శించారు.

Tags:    

Similar News