పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రానికి చేరుకున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

By :  Vamshi
Update: 2024-06-17 07:22 GMT

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పరిశీలించారు. స్పీల్‌వే, కాప‌ర్ డ్యామ్, డ‌యాఫ్రం వాల్ పనులను పరిశీలించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ప్రాజెక్టు పురోగ‌తిపై అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు పోల‌వ‌రం నుంచి ఉండ‌వ‌ల్లికి తిరిగి రానున్నారు.

Also Read - కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపం.. కేటీఆర్ ట్వీట్

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థ‌సార‌థి, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్వాగ‌తం ప‌లికారు.

Tags:    

Similar News