మహిళా నేతలపై సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు కేటీఆర్

సీఎం, డిప్యూటీ సీఎం లు వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

By :  Raju
Update: 2024-08-01 04:40 GMT

నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎం మహిళల పట్ల అత్యంత అవమానకంగా ప్రవర్తించారు. వారి ప్రవర్తను తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉన్నదన్న కనీస సోయి లేకుండా అసెంబ్లీ సాక్షిగా సీఎం స్థాయి మరిచి చేసిన నీచమైన తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్‌ కోరారు.

సుదీర్ఘకాలం ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజాసేవ చేస్తున్న ఇద్దరు మహిళా సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ ఆడబిడ్డల మనసులను నొప్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదగాలనుకుంటున్న మహిళ, ఆడబిడ్డకు అవమానకరం అన్నారు. తెలంగాణ సమాజమంతా సీఎం వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ మాటలను సీఎం భేషరతుగా ఉప సంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తున్నది. కచ్చితంగా మహిళలంతా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారు. వారికి సరైన సమయంలో బుద్ది చెప్పటం ఖాయమన్నారు.


నిండు శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి మహిళ శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యుల, సభ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చారు.మరోవైపు మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. 

ఇద్దరు సీనియర్‌ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ..ఆయన దిష్టి బొమ్మల దహనానికి బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

Tags:    

Similar News