తూప్రాన్ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లా తూప్రాన్ బాలుర గురుకులంలో విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టుకున్నారు.

By :  Vamshi
Update: 2024-09-02 13:04 GMT

మెదక్ జిల్లా తూప్రాన్ బాలుర గురుకులంలో విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఆదివారం అర్థరాత్రి 12.00 గంటలకు తొమ్మిదో తరగతి విద్యార్థులపై టెన్త్ క్లాస్ విద్యార్థులు ముకుమ్మడి దాడి చేసి చితకబాదారు. నోట్లో గుడ్డలు కుక్కి, రాడ్లతో కొట్టారు. ఈ విషయాన్ని 9వ తరగతి విద్యార్థులు.. తమ పేరెంట్స్ తెలిపారు. సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెన్షియల పాఠశాలకు చేరుకుని...ప్రిన్సిపాల్‌ నిలదీశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సరైన పర్యవేక్షణ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్బంగా ఆరోపించారు. గతంలో కుడా ఈ తరహా గోడవలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల 10వ తరగతి విద్యార్థులపై కాలేజీ విద్యార్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కొద్ది రోజులకే మరోసారి గురుకుల పాఠశాలలో ఘర్షణ చోటు చేసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత జులైలో గురుకుల పాఠశాలలో జూనియర్లను గదిలో బంధించి వారిపై సీనియర్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు బట్టలు ఉతుక్కునే సమయంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం కాస్తా ఇలా ఘర్షణలకు దారి తీస్తుందని పలువురు విద్యార్ధులు పేర్కొంటున్నారు. గురుకులంలో వార్డెన్ల నిర్లక్ష్య వైఖరి కూడా ఈ తరహా ఘటనలకు కారణమని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అనేక సందర్బంలో గురుకులంలో విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అసలే అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ ఈ గొడవలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News