సహాయక చర్యల్లో అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం

వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

By :  Vamshi
Update: 2024-09-02 11:47 GMT

వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరద సహాయక చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించినా పంపిణీలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేయడం ఇష్టం లేకపోతే జాబ్‌లు వదిలేసి ఇంటికి వెళ్లాలని ఫైర్ అయ్యారు. తానే రంగంలోకి దిగినా మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు.

ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఫుడ్ పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. సాయంత్రంలోగా పొరుగు జిల్లాల అధికారులతో మాట్లాడి మరో 3 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తెప్పించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించారు. వరద బాధితుల సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు వార్డుకు ఒక సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. బాధితులకు ఫ్రూట్స్ అందజేసే విషయంలో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పండ్లు తెప్పిస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News