చంద్రబాబు ఏరియల్‌ సర్వే, రేపల్లె పర్యటన రద్దు

పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సీఎం సూచన

By :  Raju
Update: 2024-09-04 04:55 GMT

ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలు మూడు రోజులుగా వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపల్లె పర్యటనను రద్దు చేసుకున్నారు.వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సీఎం చంద్రబాబు నేడు (బుధవారం) చేపట్టనున్న ఏరియల్‌ సర్వే, రేపల్లె పర్యటన రద్దయ్యింది. వరద బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విజయవాడ కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాలనీలు, చిన్న చిన్న గల్లీలో, ఇళ్లలో ఉన్న బురద తొలించడానికి పని చేయాలని ఆదేశించారు. అయితే విజయవాడలో మోస్తరు వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది.

మరోవైపు వరద తగ్గి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాపట్ల జిల్లా కృష్ణ తీరంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో వర్షం కురుస్తున్నది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నది. మండపేట, పి. గన్నవరం, కొత్తపేట, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తున్నది.

విజయవాడ కాల్వగట్ల ప్రాంతాల వాసులకు అలర్ట్‌ మెసేజ్‌లు

బుడమేరుకు గండితో దేవీనగర్‌ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడు కాల్వగట్ల ప్రాంతాల వాసులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అలెర్ట్‌ మెసేజ్‌లు పంపారు. బుడమేరు గండితో కాల్వగట్లపై ఉన్న ఇళ్లలోకి వరద రావొచ్చని హెచ్చరించారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం సమయానికి వరద మరింత తగ్గే అవకాశం ఉన్నది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద తగ్గడంతో లంక గ్రామాల ప్రజలు బైయటపడుతున్నారు. ఇళ్ల పై నుంచి కిందికి తగి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే లంక గ్రామాల చుట్టూ ఇప్పటికీ వరద ప్రవాం ఉన్నది. సాయంత్రానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News