పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలు వెల్లడి

నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలను విడుదల చేయాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ఆదేశింశాల మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి.

By :  Raju
Update: 2024-07-20 06:55 GMT

పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40 పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నీట్‌-యూజీ ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం జులై 18న ఆదేశించింది.

మిగతా కేంద్రాలతో పోలిస్తే కొన్ని పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా? లేదా అని తెలుసుకోవడానికే కోరుతున్నామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు తాజాగా నీట్‌-యూజీ ఫలితాలను కేంద్రాల వారీగా వెల్లడించారు. 

Tags:    

Similar News