భారీ వర్షాలతో ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారులకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదేశం

Update: 2024-09-01 08:13 GMT

భారీ వర్షాలు, వరదలతో ప్రాణనష్ట జరుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదేశించారు. మరో 24 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. నాలాలు, డ్రైనేజీ పొంగుపొర్లుతున్నందున చిన్నారులను, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని, వీలైనంత త్వరగా కరెంట్‌ సరఫరా పునరుద్దరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉంటూ అధికారులకు సహకరిస్తూ సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని కోరారు.

Tags:    

Similar News