డీఎస్సీ రాత పరీక్ష వాయిదా వేయాలని పోలీసు కాళ్లు మొక్కిన ఓ నిరుద్యోగి

డీఎస్పీ రాత ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ఇవాళ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ ముట్ట‌డికి డీఎస్సీ అభ్య‌ర్థులు పిలుపునిచ్చారు.

By :  Vamshi
Update: 2024-07-08 10:07 GMT

రాష్ట్రంలో డీఎస్సీ రాత పరీక్ష వాయిదా వేయాలని అభ్య‌ర్థులు నిర‌స‌న‌ చేపట్టారు. దీంతో హైద‌రాబాద్‌లోని విద్యాశాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త పరిస్థితి నెలకొంది. 3 నెల‌లు వాయిదా వేయాలంటూ అభ్య‌ర్థులు కార్యాల‌యాన్ని ముట్ట‌డించేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వ‌రుస‌గా పోటీ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో చ‌దువుకోవ‌డానికి స‌మ‌యం స‌రిపోద‌ని అభ్య‌ర్థులు చెబుతున్నారు. ఇటీవ‌లే టెట్ రిజల్ట్స్ రిలీజ్ అయిన నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరారు.

ఇక ఉపాధ్యాయుల నియామ‌కాలు పూర్తి అయ్యేవ‌ర‌కు విద్యా వాలంటీర్ల‌ను నియ‌మించాల‌ని వారు కోరుతున్నారు. దీంతో భారీ సంఖ్య‌లో డీఎస్సీ అభ్య‌ర్థులు స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. నిర‌స‌న తెలుపుతున్న నిరుద్యోగుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగి త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేశాడు. నిర‌స‌న‌లు తెలిపేందుకు అవ‌కాశం ఇవ్వండంటూ ఆ అభ్య‌ర్థి పోలీసు ఆఫీస‌ర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. మేం శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాం.. ఎలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌డం లేదు.. మా డిమాండ్ల‌ను సీఎం రేవంత్‌రెడ్డికి విన్న‌వించుకుంటున్నామ‌ని పేర్కొన్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కంటే గత బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే బెట‌ర్ అంటూ అత‌ను వెల్లడించారు.

Tags:    

Similar News