జీవో 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం

జీవో 317పై ఆరోగ్య, వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్‌ కమిటీ సచివాలయంలో నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-07-22 12:01 GMT

జీవో 317పై ఆరోగ్య, వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్‌ కమిటీ సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలపై ప్రధానంగా చర్చించారు. వివిధ శాఖల అధికారులు శాఖలపరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని భార్య, భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీ సమావేశంలో వివిధశాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేశ్‌ కుమార్‌ ఎక్కా దత్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News