రాజ్యసభలో 12 స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

రాజ్య సభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. 9 రాష్ట్రాల్లోని ఆయా స్థానాలకు షేడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.

By :  Vamshi
Update: 2024-08-07 10:12 GMT

రాజ్య సభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. 9 రాష్ట్రాల్లోని ఆయా స్థానాలకు షేడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. 10 మంది రాజ్య సభలు లోక్ సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుది గడువు.

సెప్టెంబర్ 3న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కించనునన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సీనియర్ రాజకీయ నేత కే కేశవరావు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కేకే రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది

Tags:    

Similar News