రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్వీ నేతలు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

By :  Vamshi
Update: 2024-06-18 06:31 GMT

కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతు బీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. రాజభవన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరుకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. నీట్ ఎగ్జమ్‌లో తప్పిదలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్‌ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు.

Also Read - ఎమ్మెల్యే సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫైర్..జీవన్ రెడ్డి మనస్తాపం 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని కోరారు. దీంతో నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్‌ పరీక్షలపై కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News