ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత

కవితకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమైన గులాబీ శ్రేణులు

By :  Raju
Update: 2024-08-28 08:12 GMT

ఢిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. వసంత్ విహార్ లోని పార్టీ ఆఫీస్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2:45 గంటల విస్తారా ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్‌కు చేరుకుంటారు

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

నిన్న ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 164 రోజుల తర్వాత కవిత జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సిద్ధమౌతున్నారు.


Tags:    

Similar News