బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు

బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆమె వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.

By :  Vamshi
Update: 2024-08-30 09:38 GMT

బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆమె వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఇంటి వద్దే ఉంటూ ఆమె చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కసారిగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయాయి. దీంతో, హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించిన డాక్టర్‌లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యల సూచన మేరకు కోవ లక్ష్మిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికంగా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దోమల వ్యాప్తికి తోడు డెంగ్యూ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. 

Tags:    

Similar News