స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ మేరకు అధికారింగా ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

By :  Vamshi
Update: 2024-08-16 12:10 GMT

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ మేరకు అధికారింగా ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా బొత్స కొనసాగనున్నారు. అయితే ఈ ఎన్నికల నుండి ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. సరైన బలం లేకవడంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికలకు వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా

ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థి గా షేక్ షఫీ నామినేషన్ వేశారు. దాంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. కానీ పోటీలో టీడీపీ లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు. బొత్స ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన వైసీపీ అధినేత​ జగన్‌కి సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News