సెక్రటేరియట్ ముందు బీజేపీ మహిళ మోర్చా నాయకుల నిరసన

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు సెక్రటేరియట్‌ని ముట్టడించారు

By :  Vamshi
Update: 2024-06-26 07:56 GMT

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నాయకులు సెక్రటేరియట్‌ని ముట్టడించారు. అనంతరం సెక్రటేరియట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మహిళా నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు.

నిత్యం మహిళల దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు ప్రభుత్వం ఏర్పాటు అయి 7నెలలు గడుస్తున్న ఇంత వరుకు హోం మంత్రిని నియమించలేదన్నారు. మహిళల బద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో మహిళా నేతలను పోలీలు బలవంతంగా అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News