బీజేడీ రాజ్యసభ ఎంపీ రాజీనామా

రాజ్యసభ సభత్యానికీ బీజేడీ ఎంపీ మమతా మొహంతా రాజీనామా చేశారు.

By :  Vamshi
Update: 2024-07-31 15:00 GMT

ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారీ షాక్ తగిలింది. బీజేడీ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా ఆ పార్టీ ప్రాథమిక సభత్యానికీ, పదవికి రాజీనామా చేశారు. ఆమె రిజైన్ లేటర్ రాజ్య సభ ఛైర్మన్ జగదీష్ ధన్‌ఖడ్ ఆమోదించారు. మమతా మొహంతా త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీల విశ్వసనీయ సమాచారం. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో 147 స్థానాలకుగాను బిజెపి 78 సీట్లతో సాధారణ మెజారిటీని గెలుచుకుంది. బిజూ జనతా దళ్ 51 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో కూడా తన రాజీనామా విషయాన్ని ఆమె తెలియజేశారు.

బీజేడీ అధ్యక్షుడు తనకు జిల్లా కౌన్సిల్ సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించి సొంత జిల్లాకు సేవ చేసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌కు రాసిన రాజీనామా లేఖలోనూ బీజేడీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేసినట్టు మమత మోహంతా తెలిపారు. మయూర్‌భంజ్ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఒడిశా సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత కమ్యూనిటీతో పాటు బిజూ జనతా దళ్‌లో ఇక తన సేవలు అవసరం లేదని భావిస్తున్నానని, ప్రజాప్రయోజనాల రీత్యా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని మమతా వివరించారు.

Tags:    

Similar News