బైడెన్‌ పోటీపై పునరాలోచించుకోవాలి: ఒబామా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై బైడెన్‌ పునరాలోచించాలని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, పెలోసీ, ఇతర డెమోక్రాట్లు ఆయనకు సూచిస్తున్నారు.

By :  Raju
Update: 2024-07-19 04:16 GMT

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల బరి నుంచి వైదొలగాని సొంత పార్టీ నుంచి ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే అనేకమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించగా.. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయావకాశాలు తగ్గిపోయాయని అన్న ఒబామా పోటీపై పునరాలించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొన్నది.

అటు డెమోక్రటిక్‌పార్టీ సీనియర్‌ నేత మాజీ హౌజ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బైడెన్‌పై నేరుగా తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆయన ఓడించలేని సూచీలు సూచిన్నట్లు ఆమె చెప్పినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో వెల్లడించింది. బైడెన్‌ అధ్యక్ష బరిలో కొనసాగితే ప్రతినిధుల సభలోనూ డెమోక్రట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. 

Tags:    

Similar News