బైడెన్‌కు స్వల్ప శ్వాసకోశ సమస్యలు

కొవిడ్‌-19 బారిన పడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు వైట్‌హౌజ్‌ వైద్యులు తెలిపారు.

By :  Raju
Update: 2024-07-19 03:53 GMT

కొవిడ్‌-19 బారిన పడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు వైట్‌హౌజ్‌ వైద్యులు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్‌ డ్రగ్‌ ప్యాక్స్‌లోవిడ్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతానికి ఆయనకు జ్వరమేమీ లేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ కెవిన్‌ తెలిపారు. మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆయన ఆరోగ్యం మామూలుగానే ఉన్నదని పేర్కొన్నారు. యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.. ఈ మేరకు గురువారం హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేశారు. 

Tags:    

Similar News