బ్యాంకులు పెద్దలకు ఒక న్యాయం..పేదలకు మరో న్యాయం : మంత్రి తుమ్మల

బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆవిష్కరించి మాట్లాడారు.

By :  Vamshi
Update: 2024-06-19 10:42 GMT

41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు తో కలిసి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్నారు. దశాబ్థాలుగా రైతే రాజు అంటున్నారు. కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. రుణాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయన్నరు. జాతీయ బ్యాంకుల బ్రాంచీల సంఖ్య తగ్గడం సరే అయింది కాదన్నారు.

జాతీయ, గ్రామీణ బ్యాంకులు విస్తృతంగా బ్రాండ్ ఇమేజ్ ని ప్రచారం చేసుకోవాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. బ్యాంకర్స్‌కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. పోల్చి చూస్తే ఈ మధ్యకాలంలో జనం ఎక్కువగా ప్రైవేటు బ్యాంకుల వైపు వెళుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు.

బహుళజాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం పేదలకు మరో న్యాయం ఉండకూడదన్నారు.మహిళా సంఘాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఇందుకుగాను ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఐదేళ్లపాటు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. 

Tags:    

Similar News