బండి సంజయ్ చొరవ..తెలంగాణకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రాన్నికి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు.

By :  Vamshi
Update: 2024-09-01 11:32 GMT

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రాన్నికి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో 119 మంది చిక్కుకుపోయారని మంత్రి బండి సంజయ్, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చెన్త్నె, వైజాగ్, అస్సాం, నుంచి మూడేసి బృందాలు చోప్పున పంపించారు.

కార్పెంటర్ పనులు చేసే 9 మంది వాగుపైన గల ప్రకాష్ బ్రిడ్జి వద్ద చిక్కుకు పోయారు. వీరిని రక్షించేదుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, హెలికాప్టర్లను తక్షణమే పంపించాలని కోరారు. అలాగే ఖమ్మంలో 110 గ్రామాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయని వివరించారు. మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News