ఆగస్టు 8 నుంచి శుభ ముహూర్తాలు.. రాష్ట్రంలో మొదలైన పెళ్లి సందడి

ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానుండటంతో తెలంగాణ వ్యాప్తంగా పెళ్ళి కళ వచ్చేసింది

By :  Vamshi
Update: 2024-08-03 11:13 GMT

తెలుగు రాష్టాల్లో మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్నటంతో తెలంగాణ వ్యాప్తంగా పెళ్ళి కళ వచ్చేసింది… ఆగస్టు 8 నుండి రెండు నెల రోజుల పాటు పెళ్ళిళ్ల సందడి అంగరంగ వైభవంగా జరగనున్నాయి… కళ్యాణ మండపాలు, పంక్షన్ హాళ్లు, కేటరింగ్, డేకరేషన్ వాళ్లకు గిరాకి రానుంది.

ఈనెల 8, 9,11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదిల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో బంధు మిత్రులతో సందడి వాతావరణం కనిపిచనుంది. ఈ సీజన్ లో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల వరకు వివాహాలు జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. ఈ సీజన్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్ల వ్యాప్తంగా దాదాపు 2 లక్షల వరకు వివాహాలు జరగనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News