నీటిపారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం : మంత్రి ఉత్తమ్‌

తెలంగాణలో నీటిపారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-08-13 14:07 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టు‌కు 500 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంద్రాగ‌స్టున సీతారామ ప్రాజెక్టు 3 పంపులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్టు తెలిపారు.

సీతారామ ప్రాజెక్టును 2026లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు స్థానంలో వైఎస్సార్ హాయాం లో రాజీవ్ సాగర్ ,ఇందిరా సాగర్‌ల నిర్మాణం చేపట్టామని కానీ కాంగ్రెస్‌కు పేరు వస్తుందని ,రాజీవ్, ఇంధిరా సాగర్‌లు కలిపి సీతారామ ప్రాజెక్టు అని బిఆర్ఎస్ నామకరణం చేసిందన్నారు. 18,231 కోట్ల అంచన ప్రాజెక్టు‌కు 7230 కోట్లు ఖర్చు పెడితే 90 శాతం పనులు ఎలా పూర్తి అవుతాయిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News