23న అసెంబ్లీ నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 23 నుంచి తెలంగాణ శాసనసభ 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

By :  Raju
Update: 2024-07-18 09:16 GMT

తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23 నుంచి తెలంగాణ శాసనసభ 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత, అలాగే చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తీర్మానాలు ఉంటాయి.

శాసనసభ, మండలి సమావేశాల తేదీలపై స్పష్టత రావడంతో ఈ నెల 24న ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.




 


Tags:    

Similar News