సమస్యలను పరిష్కరించాలని కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్లు మెరుపు ధర్నా

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని కోఠి చౌరస్తాలో మెరుపు ధర్నా చేపట్టారు

By :  Vamshi
Update: 2024-07-30 09:07 GMT

హైదరాబాద్ కోఠి చౌరస్తాలో వేలాది మంది ఆశా వర్కర్లు ఒక్కసారి మెరుపు దాడికి దిగారు. దీంతో ఆమార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామైంది. ఓ వైపు వాహనలు నిలిచిపోవడంతో హారన్ల మోత, మరోవైపు ఆశా వర్కర్ల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. రేవంత్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు వెళ్లేది లేదని ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించారు.ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన ఆశ వర్కర్లకు ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలని, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హామీ మేరకు ఉ ద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశా రు.

అర్హత కలిగిన ఆశలకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ఉద్యోగాల్లో ఆవకాశం కల్పించాలని, ప్రమాదం జరిగినా, సహజ మరణం పొందినా ఎక్స్‌గ్రేషియా అందజేయాలని, హెల్త్‌కార్డుతో కూడిన జాబ్‌చార్ట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్‌ ఉండాల్సి ఉండగా, కొన్ని చోట్ల రెండు వేల మందికి ఒక్కరే పనిచేస్తున్నారన్నారు. అందువల్లే ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిందని ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు

Tags:    

Similar News