ఆదిలాబాద్‌లో రైతుల అరెస్ట్‌ హేయమైన చర్య: హరీశ్‌ రావు

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-08-19 06:43 GMT

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో నిరసన తెలుపుతున్న రైతుల అరెస్ట్‌ హేయమైన చర్య అన్నారు. ప్రజా పాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా? అని ప్రశ్నించారు.

పోలీసులు యాక్ట్‌ (30 Act) పేరు చెప్పి జిల్లాలో నిసరనలు ఆందోళన చేయవద్దని హుకుంరుణమాఫీ కాలేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. రేవంత్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్‌ఎస్‌ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.రుణమాఫీ కాలేదని రైతులు కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియక విసిగిపోయి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

రైతులు తాము వ్యవసాయ పనులు చేసుకోవాలా? లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టు తిరగాలా? అని కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారని ఎద్దేవా చేశారు.  రైతు బంధు రాక.. రుణమాఫీ కాక అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపెట్టకుండా పోలీసులతో వారిని బెదిరించడం, అణగదొక్కే యత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు.

Tags:    

Similar News