పంద్రాగ‌స్టుకు ఏర్పాట్లు .. జిల్లాల వారీగా జెండా ఎగుర‌వేసే వారు ఎవరంటే ?

తెలంగాణ‌లో పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అధికారికంగా గోల్కొండ కోట‌పై సీఎం రేవంత్ జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు.

By :  Vamshi
Update: 2024-08-13 12:38 GMT

తెలంగాణ‌లో ఆగస్ట్ 15 వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అధికారికంగా గోల్కొండ కోట‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జిల్లా కేంద్రాల్లో జాతీయ ఎగుర‌వేసేది వీరే..

1. ఆదిలాబాద్ – మ‌హ్మ‌ద్ అలీ ష‌బ్బీర్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు

2. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

3. హ‌నుమ‌కొండ – మంత్రి కొండా సురేఖ‌

4. జ‌గిత్యాల – ప్ర‌భుత్వ విప్ ల‌క్ష్మ‌ణ్ కుమార్

5. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – పోదెం వీర‌య్య‌

6. జ‌న‌గాం – ప్ర‌భుత్వ బీర్ల ఐల‌య్య‌

7. జోగులాంబ గ‌ద్వాల్ – ఏపీ జితేంద‌ర్ రెడ్డి

8. కామారెడ్డి – ప‌టేల్ ర‌మేశ్ రెడ్డి

9. క‌రీంన‌గ‌ర్ – మంత్రి శ్రీధ‌ర్ బాబు

10. ఖ‌మ్మం – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

11. కుమ్రం భీం ఆసిఫాబాద్ – మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్

12. మ‌హ‌బూబాబాద్ – ప్ర‌భుత్వ విప్ రామ‌చంద‌ర్ నాయ‌క్

13. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

14. మంచిర్యాల – హ‌ర‌క‌ర వేణుగోపాల్

15. మెద‌క్ – ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు

16. మేడ్చ‌ల్ – ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి

17. ములుగు – మంత్రి సీతక్క‌

18. నాగ‌ర్‌క‌ర్నూల్ – జి చిన్నారెడ్డి

19. న‌ల్ల‌గొండ – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

20. నారాయ‌ణ‌పేట – గుర్నాథ్ రెడ్డి

21. నిర్మ‌ల్ – రాజ‌య్య సిరిసిల్ల‌

22. నిజామాబాద్ – అనిల్ ఎరవ‌త్రి

23. పెద్ద‌ప‌ల్లి – నేరెళ్ల శార‌ద‌

24. రాజ‌న్న సిరిసిల్ల – ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్

25. రంగారెడ్డి – వేం న‌రేంద‌ర్ రెడ్డి

26. సంగారెడ్డి – మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

27. సిద్దిపేట – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

28. సూర్యాపేట – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

29. వికారాబాద్ – స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

30. వ‌న‌ప‌ర్తి – ప్రీతం

31. వ‌రంగ‌ల్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

32. యాదాద్రి భువ‌న‌గిరి – మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

Tags:    

Similar News