గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశం
గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2 నుంచి 6 గంటల వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నది.
By : Raju
Update: 2024-08-31 16:49 GMT
గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2 నుంచి 6 గంటల వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నది. దరఖాస్తుల్లో తప్పులుంటే అభ్యర్థులు సరిచేసుకోవాలని సూచించింది.
తెలంగాణలో గ్రూప్-3 సర్వీస్‌కు సంబంధించి 1,388 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ రాత పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.