రెండు వారాల్లోపు మరో సమావేశం..మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరకదు : భట్టి

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేము భావించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

By :  Vamshi
Update: 2024-07-06 16:15 GMT

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత తెలంగాణ, ఏపీ మంత్రులు ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భేటీలో అనేక అంశాలపై లోతుగా చర్చించాం. పదేళ్లుగా పరిష్కారం కానీ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎస్‌లుతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నాం. రెండు వారాల్లోపు మరో సమావేశం ఉంటుందని భట్టి తెలిపారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రి లు ఆమోదం తెలుపుతారన్నారు. ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించామని భట్టి తెలిపారు.

వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల పై కలిసి పనిచేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పట్టిపీడిస్తున్న గంజాయి అరికట్టడానికి ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. అడిషనల్ డీజీ స్థాయిలో ఓ గ్రూప్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. యాంటీ నార్కోటిక్ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు. సైబర్ క్రైమ్ సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని వీటిని నియంత్రించాలని నిర్ణయించామన్నారు.హైదరాబాద్‌లోని స్థిరాస్తులను ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అంటున్నారు. అవసరమైతే ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్‌లో భవనం కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. భూమి కోసం ఏపీ అర్జీ పెట్టుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News