ఘనంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా జరుగుతున్నది. ఇందులో భాగంగా 'మామెరు' వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.
వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు, వరుడు అనంత్ అంబానీ, వధువు రాధిక ముందస్తు వివాహ వేడుకలు ముంబయిలో ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ సంప్రదాయం ప్రకారం 'మామెరు' వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. వధూవరులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెళ్లికి కొన్నిరోజుల ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు.
వరుడి తల్లి నీతా అంబానీ పుట్టింటివారు ఈ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుముతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధిక మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందించారు.
అనంత్, రాధిక 'మామెరు' వేడుక కోసం అంబానీ నివాసాన్ని యాంటియాల్ను అందంగా తిర్చిదిద్దారు. ఎరుపు, గులాబీ, నారింజ పూలతో అలంకరించారు. అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జులై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. జులై 12న ముఖ్యఘట్టమైన శుబ్ వివాహతో పెళ్లి వేడుకలతో మొదలై.. జులై 14న మంగళ్ ఉత్సవ్ వేడుకలతో ముగుస్తాయి. ఈ వేడుకలకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులలో హాజరకానున్నారు.