నేడు తెరుచుకోనున్న'అమృత్‌ ఉద్యాన్‌'

ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్‌లో 'అమృత్‌ ఉద్యాన్‌' నేడు తెరుచుకోనున్నది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దీనికి శ్రీకారం చుడుతారు.

By :  Raju
Update: 2024-08-14 05:29 GMT

ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్‌లో 'అమృత్‌ ఉద్యాన్‌' నేడు తెరుచుకోనున్నది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దీనికి శ్రీకారం చుడుతారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్‌ 15 వరకు . ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు సందర్శించడానికి అనుమతిస్తారు. అన్ని సోమవారాల్లో సెలవు ఉంటుదన్న అధికారులు సందర్శకులు తమ ఇంటి ముందు తులసి మొక్కల విత్తనాలతో కూడిన సీడ్‌ పేపర్లను పర్యావరణ హిత జ్ఞాపికగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

అలాగే ఉద్యాన వనంలో చిన్న పిల్లల కోసం అబాకస్‌, ధ్వని వినిపించే గొట్టాలు, సంగీత కుడ్యాలు ప్రత్యేకంగా రాళ్లతో రూపొందించి ఏర్పాటు చేశారు. 15 ఎకరాల్లో విస్తరించిన అమృత్‌ ఉద్యానాన్ని ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. అయితే దీనికోసం రాష్ట్రపతి భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉద్యాన్‌ ఉత్సవ్-1 పేరుతో 'అమృత్ ఉద్యాన్‌' జనవరి 29 నుంచి మార్చి 31 వరకు తెరిచారు. అప్పుడు దీనిని 10 లక్షల మందికి పైగా సందర్శించారు. 

Tags:    

Similar News