విశ్వావసునామ సంవత్సరం పండుగల జాబితాను సీఎంకు అందించిన పంచాంగకర్తలు

2025-26 పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు కొండా సురేఖకి విద్వత్ సభ బాధ్యులు అందించారు.

By :  Vamshi
Update: 2024-07-29 10:56 GMT

తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు ఆమోదించిన విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కొండా సురేఖకి విద్వత్ సభ బాధ్యులు అందించారు. ఈ సందర్భంగా విద్యత్ సభ బాధ్యులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ అభినందించారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రాధ్యాతనిస్తూ విద్వత్ సభ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశాంసనీయమైనవని సీఎం అన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తీర్చాలని దేవాదాయ శాఖకు సీఎం సూచించారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా పండుగల నిర్వహణలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా పండుగల జాబితాను నిర్ధారించి అందించిన విద్వత్ సభను మంత్రి సురేఖ అభినందించారు. వారి కృషి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, యాదాద్రి దేవస్థానం చైర్మన్ నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నర్సింహాచార్యులు, తెలంగాణ విద్వత్ సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి ఎంవిఆర్ శర్మ (దర్శనం శర్మ), వేదంపండితులు నటరాజ శర్మ, సాయి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News