స్వాతంత్ర దినోత్సవం వేళ సరిహద్దులో అప్రమత్తం

స్వాతంత్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లో సైన్యం అప్రమత్తమైంది. ఇటీవల వరుస దాడులు జరిగిన అనంతనాగ్‌, దోడా, రాజౌరీ జిల్లాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

By :  Raju
Update: 2024-08-13 03:07 GMT

స్వాతంత్ర దినోత్సవం వేళ జమ్ముకశ్మీర్‌లో సైన్యం అప్రమత్తమైంది. ఇటీవల వరుస దాడులు జరిగిన అనంతనాగ్‌, దోడా, రాజౌరీ జిల్లాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల వేటకు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలను, జాగిలాలను రంగంలోకి దించారు.

స్వాతంత్ర దినోత్సవం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. రాజౌరీ జిల్లాలోని సుందర్బని,  నౌషేరా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యాధునిక ఆయుధాలతో భారత సైన్యం జల్లెడ పడుతున్నది. లోయలో కదలికపై సీసీ కెమెరాల ద్వారా నిశితంగా గమనిస్తున్నారు. ఆర్మీ జాగిలాలు, డ్రోన్లతో అణువణువు గాలిస్తున్నారు.

అనంతనాగ్‌ జిల్లాలో శనివారం ఆర్మీపై కాల్పులు అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ముష్కరుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతున్నది. సుమారు నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గత నెలలో దోడా జిల్లాలో నలుగురు జవాన్ల మృతికి కారణమైన ముష్కరులు అక్కడి నుంచి అనంతనాగ్‌కు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శనివారం ఉగ్రవాదులు సైన్యానికి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. 

Tags:    

Similar News