కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష

మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్‌ అధికారులతో సమీక్ష చేయనున్న సీఎం అనంతరం ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు

By :  Raju
Update: 2024-09-02 05:30 GMT

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం ఖమ్మం బయలుదేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముగ్గురు మంత్రులున్నా ముంపు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలోనే ఎట్టకేలకు ఖమ్మం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు బయలు దేరనున్నారు.

మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళన

మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నార. తాగునీరు కూడా అందించడం లేదని మహిళలు వాపోతున్నారు. ఖమ్మం కరుణగిరి వద్ద సాయికృష్ణ నగర్‌ వాసులు ఆందోళన దిగారు. 

Tags:    

Similar News