అదానీ దేశ సంపద దోచుకుంటున్నారు : రేవంత్‌రెడ్డి

అదానీ, సెబీ ఛైర్‌పర్సన్‌తో కలిసి భారత దేశ సంపద దోచుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదానీ అక్రమాలను హిండెన్‌బర్గ్ బయట పెట్టిందని సీఎం అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-22 09:06 GMT

అదానీ, సెబీ ఛైర్‌పర్సన్‌తో కలిసి భారత దేశ సంపద దోచుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదానీ అక్రమాలను హిండెన్‌బర్గ్ బయట పెట్టిందని సీఎం అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించడని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దేశ సంపదను దోచుకోవటానికి ప్రధాని మోదీ అనుమతి ఇచ్చారని రేవంత్ విమర్శించారు.

ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ధర్నాలో సీఎం పాల్గొన్నారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్ చేశారు. దేశాన్ని మోడీ అప్పుల ఊబీలో ముంచారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55లక్షల కోట్లు. ప్రస్తుతం దేశం అప్పుచ కోటీ రూ.55లక్షల కోట్లు. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారిందన్నారు.

Tags:    

Similar News