హైదరాబాద్ నగరంలో ఫేక్ ఓట్లపై చర్యలు : ఆమ్రపాలి

హైదరాబాద్ నగరంలో ఫేక్ ఓట్లు పెరిగాయని వివిధ పార్టీల పార్టీల నాయకులు జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకొచ్చారు.

By :  Vamshi
Update: 2024-09-05 09:52 GMT

హైదరాబాద్ నగరంలో ఫేక్ ఓట్లు పెరిగాయని వివిధ పార్టీల నాయకులు జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై సమావేశం నిర్వహించారు. బీఎల్‌వో లేకపోవడంతోనే అధికారులు పేర్లు చెప్పలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అమ్రపాలి తెలిపారు. స్పెషల్‌ సమ్మరి రివిజన్‌- 2025 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని కమిషనర్‌ కోరారు.

అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో నమోదుకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు అర్హులైన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకొనే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించిందని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ కోసం, పోలింగ్‌ స్టేషన్‌ సరిహద్దులు సరిచేయడానికి బీఎల్‌ఓలు ఇంటింటి  సర్వేను అక్టోబరు18 వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. ‘‘సమగ్ర డ్రాఫ్ట్‌ రోల్స్‌ కోసం, ఓటరు నమోదు, మార్పులు చేర్పులు  అక్టోబర్‌ 19నుంచి28 వరకు పూర్తి చేయనున్నట్లు కమీషనర్ తెలిపారు

Tags:    

Similar News