సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీకరణ

సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు అన్‌లైన్‌లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించారు

By :  Vamshi
Update: 2024-07-02 15:27 GMT

ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు అన్‌లైన్‌లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత వైబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.15 తర్వాత దరఖాస్తులను అన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు.

ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు.. https//cmrf.telangana.gov.in సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు

Tags:    

Similar News