రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ సింఘ్వి ఏకగ్రీవం

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. ఇండిపెండెంట్‌గా

By :  Raju
Update: 2024-08-27 10:41 GMT

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎవరూ బలపరచకపోవడంతో పద్మరాజన్‌ నామినేషన్‌ ను అధికారులు తిరస్కరించారు. దీంతో సంఘ్వీ ఏకగ్రీవమయ్యారు. ఆయన తరఫున కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకోనున్నారు.బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే. కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. 

సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న అభిషేక్‌ సింఘ్వీ 2006, 2018లో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పోటీ చేసినా సొంత పార్టీ నేతలే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో బీజేపీ చేతిలో ఓడిపోయారు. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు కోసం స్థానిక నేతలు ప్రయత్నించినా అభిషేక్‌ వైపే ఆపార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. 

Tags:    

Similar News