ఆధార్-రేషన్ కార్డు లింక్ గడువు పెంపు

రేషన్ కార్డు ఆధార్ అనుసంధానం గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Byline :  Vamshi
Update: 2024-06-12 10:01 GMT

ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరుకు పొడిగించింది. జున్ 30తో గడువు ముగియనుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు.

Also Read -  తెలంగాణ ఇంట‌ర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు.

Tags:    

Similar News