డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌ల మధ్య మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు దగ్గరపడుతున్నకొద్దీ ట్రంప్‌, కమలా హారిస్‌ మధ్య మాట యుద్ధం పెరుగుతున్నది.

By :  Raju
Update: 2024-08-01 02:36 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు దగ్గరపడుతున్నకొద్దీ ట్రంప్‌, కమలా హారిస్‌ మధ్య మాట యుద్ధం పెరుగుతున్నది. తాజాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కమలాహారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు ఇండియానా? నల్ల జాతీయురాలా? ఎవరంటూ వ్యాఖ్యానించారు. ఆమె ఎప్పుడూ భారతీయ వారసత్వాన్నే ప్రచారం చేసిందని, కొన్నేళ్ల కిందటివరకు ఆమె నల్ల జాతీయురాలని నాకు తెలియదన్నారు. ఆమె ఆ విధనమైన గుర్తింపును కోరుకుంటున్నదని ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తన జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కమలా హరిస్‌ ఆయనకు ధీటుగానే బదులిచ్చారు. వాస్తవాలు చెప్పాల్సి వచ్చినప్పుడు శతృత్వం, కోపంతో స్పందించని నాయకుడు కావాలన్నారు. మన వైవిధ్యాలను అర్థం చేసుకునే నాయకుడు కావాలని, మన్నలి విభజించే నాయకుడు అవసరం లేదన్నారు.

Tags:    

Similar News