ధవళేశ్వరంలో వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు

By :  Vamshi
Update: 2024-07-27 11:21 GMT

ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో ధవళేశ్వరంలో వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రెండో ప్రమాద హెచ్చారిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సముద్రంలోకి 13లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాయి. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండలని అధికారులకు సూచించారు.

కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉండగా... గోదావరి ఉద్ధృతి మళ్లీ పెరగడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరగటం ఆందోళన కలిస్తోంది, గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. వరద నీటిలోకి దిగొద్దని స్పష్టం చేసింది.

Tags:    

Similar News