ఐదు రోజుల లాభాల పరుగుకు కళ్లెం

ఐదు రోజుల సూచీల లాభాల దూకుడుకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో లోహ, వాహన, ఐటీ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి.

By :  Raju
Update: 2024-08-03 03:03 GMT

ఐదు రోజుల సూచీల లాభాల దూకుడుకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో లోహ, వాహన, ఐటీ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. ఫలితంగా నిఫ్టీ 25,000 పాయింట్ల నుంచి వెనక్కి వచ్చింది.

సూచీల నష్టాలతో ముదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ. 4.46 లక్షల కోట్లు తగ్గి రూ. 457.16 లక్షల కోట్లు (5.46 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 81,158.99 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏ దేశలోనూ కోలుకోలేకపోయిన సూచీ ఒకదశలో 80,868.91 పాయింట్లకు పడిపోయింది. చివరకు 885.60 పాయింట్ల నష్టంతో 80,981.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 293.20 పాయింట్లు కోల్పోయి 24,717.70 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.72 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 0.77 శాతం పెరిగి 80.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Tags:    

Similar News