మూడు వ్యాధులతో బాధపడుతున్న బాలుడు.. ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

పుట్టుకతో మూడు వ్యాధులతో బాధపడుతూ వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నాడు బాలుడుకి సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

By :  Vamshi
Update: 2024-07-31 09:58 GMT

పుట్టుకతో మూడు వ్యాధులతో బాధపడుతూ వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నాడు బాలుడుకి సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండె లగూడెం గ్రామానికి చెందిన కొత్త పల్లి బాబు, కళ్యాణి దంపతులకు ఈ నెల 25న బాబు జన్మించాడు. పుట్టుకతోనే శ్వాసకోశనాళం, ఆహార నాళం అతుక్కుపోయింది. గుండెలో రంధ్రం పడింది. ఒకే కిడ్నీతో బాధపడుతున్నాడు. ఆహార నాళం పనిచేయకపోవడంతో పాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

దీంతో శుక్రవారం బోడుప్పల్ లోని అంకురా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం బాలుడు వెంటిలేషన్‌పై ఉన్నాడు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో దాదాపు రూ.7 లక్షల వరకు చికిత్స, మెడికల్ బిల్లులు అవుతున్నా యి. బాలుడు తండ్రి కొత్తపల్లి బాబు వాటర్ ట్యాంకర్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. పేదరికం కారణంగా ఆసుపత్రి ఖర్చులు భరించుకోలేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా దాతలు 8341144126, 8328041624 ఫోన్ పే లేదా నేరుగా సంప్రదించి సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

Tags:    

Similar News