కేరళలో నిపా వైరస్‌ కలకలం.. 14 ఏళ్ల బాలుడి మృతి

కేరళలో నిపా వైరస్‌ కలకలం సృష్టిస్తున్నది. ఆ వైరస్‌ సోకిన 14 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

By :  Raju
Update: 2024-07-21 09:55 GMT

కేరళలో నిపా వైరస్‌ కలకలం సృష్టిస్తున్నది. ఆ వైరస్‌ సోకిన 14 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వైరస్‌ సోకిన గంటల్లోనే మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.

మళప్పురం జిల్లాలోని పండిక్కడ్‌కు చెందిన 14 ఏళ్ల నిపా వైరస్‌ సోకినట్టు వీణా జార్జ్‌ శనివారమే వెల్లడించారు. పూణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధారించిందని తెలిపారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆ బాలుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. బాధితుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు. అతనికి ఎవరెవరు దగ్గరగా వచ్చింది ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇంతలోనే బాలుగు మృతి చెందాడు.

ఆదివారం బాలుడికి మూత్రం రావడం ఆగిపోయిందని, కొద్దిసేపటికే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. బాలుడిని బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైయ్యాయి అన్నారు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి అంత్యక్రియలు నిర్వహస్తామని చెప్పారు. దీనిపై బాలుడి కుటుంబసభ్యులతో జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

Tags:    

Similar News