భారీ వర్షాల నేపథ్యంలో 86 రైళ్ల రద్దు

హైదరాబాద్‌-విజయవాడ వరదల్లో చిక్కుకోవడంతో టీజీఎస్‌ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది.

By :  Raju
Update: 2024-09-02 04:35 GMT

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 86 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు 70కి పైగా రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నది. రద్దయిన రైళ్లలో సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. పలు ప్యాసింజర్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.




 


560కి పైగా బస్సుల రద్దు

65వ నంబర్‌ జాతీయ రహదారి హైదరాబాద్‌-విజయవాడ వరదల్లో చిక్కుకోవడంతో టీజీఎస్‌ఆర్టీసీ భారీగా బస్సులు రద్దు చేసింది. 560కి పైగా బస్సులను అధికారులు రద్దు చేశారు. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్‌ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది.

Tags:    

Similar News