83 మంది డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By :  Vamshi
Update: 2024-08-29 15:37 GMT

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు ఎమ్మార్వోగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ లచ్చి రెడ్డి, టీజీటీఏ కృషి ఫ‌లితంగానే డీటీల‌కు త‌హ‌శీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌ హ‌ర్షం వ్యక్తం చేసింది.

గతంలోనూ ప‌దోన్నతుల‌ను ఇప్పించిన చ‌రిత్ర టీజీటీఏకే ఉంద‌న్నారు. ఈ మేర‌కు తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు,సీఎం రేవంత్‌, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డికి, సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌కి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప‌దోన్నతుల కోసం ఎదురు చూసే డీటీల‌కు త‌హ‌శీల్దార్లుగా అవ‌కాశం క‌ల్పించ‌డం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News