51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం

By :  Raju
Update: 2024-09-03 13:51 GMT

ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు విలీనమయ్యాయి. శంషాబాద్‌ మున్సిపాలిటీలో బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్‌, రషీద్‌ గూడ, ఘంసీమిగూడ గ్రామాలను విలీనం చేశారు. 

మున్సిపాలిటీలు.. విలీనమయ్యే గ్రామాలు

పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌ తారామతి పేట పంచాయతీలు విలీనం

శంషాబాద్‌ మున్సిపాలిటీలో బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్‌, రషీద్‌ గూడ, ఘంసీమిగూడ విలీనం

నార్సింగి మున్సిపాలిటీలో మీర్చాగూడ గ్రామ పంచాయతీ

తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయితీ

మేడ్చల్‌ మున్సిపాలిటీలో పూడురు, రాయిలాపూర్‌ గ్రామ పంచాయతీలు

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి

నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు

పోచారం మున్సిపాలిటీలో వెంకటాపూర్‌, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో అంకుషాపూర్‌, ఔషాపూర్‌, మాదారం , ఏదులాబాద్‌, ఘనాపూర్‌, మర్పల్లిగూడ విలీనం

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునిరాబాద్‌, గౌడవెల్లి పంచాయతీలు

తూంకుంట మున్సిపాలిటీలో బొంరాసిపేట, శామీర్‌పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం

Tags:    

Similar News