రేపు దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్యసేవలు బంద్

రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు తప్ప ఇతర వైద్య సేవలు 24 గంటల నిలిచిపోనున్నాయి.

By :  Vamshi
Update: 2024-08-16 11:50 GMT

రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు తప్ప ఇతర వైద్య సేవలు 24 గంటల నిలిచిపోనున్నాయి. ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను బంద్ కానున్నాయి. కోల్‌కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యరాలిపై రేప్, మర్డర్ సంఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యలంతా ఈ నిరసనలో తప్పకుండా పాల్గొనాలని ఐఎంఏ సూచించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపిచేసారు ప్రభుత్వ వైద్యులు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూ.డా లు ఓపీ సేవలను బహిష్కరించారు.ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఓపీ, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్ కత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్‌లో వైద్యులు విధులు బహిష్కరించారు. నిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించింది. రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News