శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సర్వదర్శనానికి కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఏటీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు.

By :  Raju
Update: 2024-06-22 04:19 GMT

తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సర్వదర్శనానికి కంపార్ట్‌మెంట్లన్నీ నిండి ఏటీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. వీరికి సుమారు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనున్నదని టీటీడీ తెలిపింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి మూడు గంటల సమయం పడుతున్నది. నిన్న 72,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,, 31,855 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు లభించాయి

నేడు శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారం ఆలయంలో శనివారం గరుడ సేవ జరగుతుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నది. దీనిలోభాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనిమిస్తారు.

Tags:    

Similar News