భారీ వర్షాలకు 1400 ఆర్టీసీ బస్సులు రద్దు

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టీజీఎస్ ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది.

By :  Vamshi
Update: 2024-09-02 10:33 GMT

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టీజీఎస్ ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. మొత్తం 1400 బస్సులను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

అలాగే మరికొన్ని బస్సులను రూట్ మార్చి నడుపుతున్నామని పేర్కొన్నారు.. అందులో విజయవాడకు వెళ్లే బస్సులను సూర్యాపేట మీద నుంచి కాకుండా గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. అలాగే వర్షాలతో పాటు వరదలు తగ్గగానే బస్సు సర్వీసులను పునరుద్దరిస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News